Avail Exciting Offers
checkFacts Checked

మొటిమల చికిత్స: కారణాలు, లక్షణాలు, ఆధునిక చికిత్సలు మరియు ఖర్చులు

Dr. Debatri Datta
Reviewed by Dr. Debatri Datta
MBBS, MD in Dermatology, Venereology & Leprosy
Written by : Dr. Debatri Datta
Updated on: June 10, 2026

మొటిమలు (Acne) అనేది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది యువత మరియు పెద్దలను ప్రభావితం చేసే సాధారణ చర్మ సమస్య. ముఖం, మెడ, ఛాతీ, భుజాలు మరియు వీపు వంటి ప్రాంతాల్లో మొటిమలు కనిపిస్తాయి. హార్మోన్ల మార్పులు, అధిక చర్మ తైలం (Sebum) ఉత్పత్తి, బ్యాక్టీరియా పెరుగుదల మరియు మూసుకుపోయిన రంధ్రాలు మొటిమలకు ప్రధాన కారణాలు. సరైన సమయంలో సరైన చికిత్స తీసుకుంటే మొటిమలను నియంత్రించడంతో పాటు వాటి వల్ల వచ్చే మచ్చలను కూడా తగ్గించుకోవచ్చు.

మొటిమలు అంటే ఏమిటి?

మొటిమలు (Acne) అనేది చర్మంపై వచ్చే ఒక సాధారణ సమస్య. ఇవి చాలావరకు యుక్తవయస్సులో వస్తాయి, కానీ పెద్దవారికి కూడా రావచ్చు. చర్మంలోని సేబాషియస్ గ్రంథులు అధికంగా నూనె (సీబమ్) ఉత్పత్తి చేసినపుడు, అది చర్మ రంధ్రాలను అడ్డుకొంటుంది. దీంతో బ్యాక్టీరియా పెరిగి వాపు వస్తుంది దీన్నే మొటిమలు అంటారు.

మొటిమలు రావడానికి కారణాలు

  • హార్మోన్ల మార్పులు – యుక్తవయస్సు, గర్భావస్థ, PCOD వంటి పరిస్థితుల వల్ల
  • అధిక చమురు (oily skin) చర్మం కలిగిన వారికి
  • సరిపడని కాస్మెటిక్స్ వాడకం వల్ల
  • ఒత్తిడి (stress) మరియు నిద్రలేమి వల్ల
  • అనుచిత ఆహారపు అలవాట్లు – జంక్ ఫుడ్, చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల
  • జన్యుపరమైన కారణాలు (Genetics)

మొటిమల రకాలు

  • వైట్‌హెడ్స్ (Whiteheads): చర్మం కింద మూసుకుపోయిన రంధ్రాలు; తెల్లగా కనిపిస్తాయి.
  • బ్లాక్‌హెడ్స్ (Blackheads): తెరిచిన రంధ్రాల్లో పేరుకుపోయిన నూనె; నల్లగా మారుతుంది.
  • పాపుల్స్ (Papules): చిన్న ఎర్రని వాపు కలిగిన మొటిమలు.
  • పస్ట్యూల్స్ (Pustules): చీమముట్టు వంటివి; పైన తెల్లని చీము కనిపిస్తుంది.
  • నోడ్యూల్స్ & సిస్ట్స్: చర్మంలో లోతుగా ఏర్పడే పెద్ద, నొప్పి కలిగించే మొటిమలు.

మొటిమలకు చికిత్సలు

మొటిమల చికిత్సలో ఒలివా స్కిన్ & హెయిర్ క్లినిక్ భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన క్లినిక్‌గా గుర్తింపు పొందింది. హైదరాబాద్ మరియు ఇతర నగరాల్లో అనేక శాఖలు కలిగిన ఈ క్లినిక్ అంతర్జాతీయ స్థాయి చికిత్సలను అందిస్తుంది.

1. టాపికల్ చికిత్సలు (Topical Treatments)

ఇవి నేరుగా చర్మంపై పూసే మందులు:

  • బెంజాయిల్ పెరాక్సైడ్:బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది
  • సాలిసిలిక్ యాసిడ్: చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది
  • రెటినాయిడ్స్ (Retinoids):చర్మ కణాల నవీకరణను వేగవంతం చేస్తాయి
  • అజెలాయిక్ యాసిడ్: చర్మాన్ని సమానంగా చేస్తుంద

2. నోటి ద్వారా వేసుకునే మందులు (Oral Medications)

  • యాంటీబయాటిక్స్డా: క్సిసైక్లిన్, మినోసైక్లిన్ వంటివి బ్యాక్టీరియా వ్యాప్తిని తగ్గిస్తాయి
  • హార్మోన్ చికిత్స: మహిళల్లో హార్మోన్ అసమతుల్యత కారణంగా వచ్చే మొటిమలకు
  • ఐసోట్రెటినాయిన్ (Isotretinoin):తీవ్రమైన మొటిమలకు డాక్టర్ పర్యవేక్షణలో

3. క్లినికల్ / అడ్వాన్స్‌డ్ చికిత్సలు

  • కెమికల్ పీలింగ్ (Chemical Peeling): గ్లైకోలిక్ యాసిడ్ వంటి పదార్థాలతో చర్మపు పై పొర తొలగించి, కొత్త చర్మం రావడానికి సహాయపడుతుంది. మొటిమల మచ్చలు తగ్గుతాయి.
  • లేజర్ థెరపీ (Laser Therapy): లేజర్ కాంతి సహాయంతో బ్యాక్టీరియాను నాశనం చేసి, మొటిమల మచ్చలను తగ్గిస్తుంది.
  • మైక్రోనీడ్లింగ్ (Microneedling):సూక్ష్మమైన సూదులతో చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించి మచ్చలను తగ్గిస్తుంది.
  •  

    హైడ్రాఫేషియల్ (HydraFacial): చర్మాన్ని లోతుగా శుభ్రపరచి, తేమను అందిస్తుంది.

  •  

    LED లైట్ థెరపీ: నీలి కాంతి మొటిమలు కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

ఒలివా ఎందుకు ప్రత్యేకం?

  • అనుభవజ్ఞులైన డెర్మటాలజిస్ట్ బృందం.
  • ప్రతి రోగికి ప్రత్యేకంగా రూపొందించిన చికిత్స ప్రణాళిక.
  • హైదరాబాద్‌లో బంజారహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి సహా పలు శాఖలు.

ఇంట్లో తీసుకోవలసిన జాగ్రత్తలు

  • రోజుకు రెండుసార్లు మృదువైన ఫేస్‌వాష్‌తో మొహం శుభ్రం చేసుకోండి
  • మొటిమలను చేతులతో పిండకండి — ఇది మచ్చలు మిగులుతాయి
  • నూనె లేని (oil-free) మాయిశ్చరైజర్ మరియు సన్‌స్క్రీన్ వాడండి
  • ఆరోగ్యకరమైన ఆహారం తినండి: పళ్ళు, కూరగాయలు, నీరు అధికంగా తీసుకోండి
  • ప్రతిరోజూ 7-8 గంటలు నిద్రపోండి
  • ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయండి

ముగింపు

మొటిమలు చికిత్సకు మించినవి కావు సరైన వైద్యుని సహాయంతో మీరు స్వచ్ఛమైన, మెరిసే చర్మాన్ని పొందవచ్చు. ఇంట్లో చేసే జాగ్రత్తలు తీసుకుంటూ, అవసరమైతే ఒలివా స్కిన్ & హెయిర్ క్లినిక్ వంటి నిపుణుల సహాయం తీసుకోండి. మీ చర్మం మీకు విలువైనది  దాని పట్ల శ్రద్ధ తీసుకోండి!

Offer Banne desktopr
Avail Exciting Offers